![]() |
![]() |

ఎక్స్ట్రా జబర్దస్త్ షో ఎక్స్ట్రా ఫన్ తో ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక ఈ వారం షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో 'రంగ రంగ వైభవంగా' మూవీ నుంచి వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ వచ్చారు. ఇక ఈ షోలో సుడిగాలి సుధీర్ గురించి ఇన్ డైరెక్ట్ గా సెటైర్ లు పడ్డాయి. ఫైమా, బులెట్ భాస్కర్ కలిసి ఒక స్కిట్ వేశారు. ఒక రాజ్యానికి రాజు, రాణిలా నటించారు. "పక్క రాజ్యం వాళ్ళు మన రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు బయటికి వెళ్లిపోవడానికి ఒక సొరంగం తవ్వండి" అంటూ భాస్కర్ తో అంటుంది ఫైమా. "సొరంగం సొరంగం అని చెప్పి ఒకడ్ని ఎంకరేజ్ చేశారు వాడేం చేసాడు... ఆ సొరంగంలోంచి పక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాడు" అంటూ సుధీర్ మీద పంచ్ డైలాగ్స్ వేసాడు భాస్కర్.
తర్వాత ఇమ్ము, వర్ష కలిసి స్కిట్ వేస్తారు. "ఈరోజు నుంచి నా లైఫ్ లో వర్ష లేదు, కేతిక వుంది" అంటాడు ఇమ్ము. "మిమ్మల్ని చూడకుండా ఒక్క రోజు కూడా గడపను. ఎందుకంటే మీరంటే నాకు అంత ఇష్టం.. ఐ లవ్ యూ సో మచ్" అంటూ చెప్తాడు. "థ్యాంక్యూ సో మచ్ భాస్కర్ గారు" అంటూ ఇమ్ముని పిలిచేసరికి కెవ్వుమని అరుస్తాడు. వైష్ణవ్ తేజ్ "ఐ లవ్ వర్ష" అంటూ చెప్పాడు.
ఇక గెటప్ శీను తమ్ముడు వేషంలో వచ్చి తన స్కిట్ లో అలరించాడు. ఫైనల్ గా షబీనా వచ్చి తన కాబోయే భర్తను స్టేజి మీదకు తీసుకొచ్చి అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది. అతన్ని చూసేసరికి షబీనాని ప్రేమించిన నాటీ నరేష్ ఏడుస్తాడు. రష్మీ, కెవ్వు కార్తీక్ వచ్చి ఓదార్చి "షబీనా పొతే పోయింది, మన సెట్ కి కేతిక వచ్చింది" అంటూ చిరంజీవి డైలాగ్ చెప్పి ఫన్ క్రియేట్ చేశారు.
![]() |
![]() |